motivate

Sorting: Latest | Popular | Pending

నిను ప్రేమించే మనసు నాకు ఉంది కానీ
నా ప్రేమను పొందే అర్హత నీకు లేదు
కట్నం పేరుతో హింసిస్తాడు ఒకడు..
సంసారం చేయట్లేదని చిత్రవధ చేస్తాడు మరొకడు.
ప్రేమ పేరుతో మోసం చేస్తాడు మరొకడు.

ఎంతకాలం రా ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు?
అదే మోసం మనకి జరిగితే ఎంత బాధపడతాం.
అదే కష్టం మన వాళ్ళు పడితే ఎంత వేదన పడతాం.

ఒకసారి ఆలోచించండి,స్త్రీలను గౌరవించండి,భార్యను ప్రేమించండి,
డబ్బు ఉందని సంపాదిస్తున్నాడు అని పెళ్లి చేసుకోవద్దు,డబ్బు కన్నా character ముఖ్యం.
ప్రేమానురాగాలు ముఖ్యం.

ఇక విషయాని వస్తే
ఆడపిల్లలు మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచన మార్చుకోండి.
లేదా పెళ్లి చేసేటప్పుడు
అబ్బాయి డబ్బున్నవాడ?
ఎంత సంపాదిస్తున్నాడు?
ఫారెన్ లో ఉన్నాడా? సాఫ్ట్ వేరా? డాక్టరా?
సోషల్ స్టేటస్ ఏంటి?
పెళ్లి ఇంత ఖర్చు పెట్టి చేద్దాం అని కాకుండా..
అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నాడు..
ఏ కష్టం లేకుండా చేసుకుంటాడా లేదా చూడాలి.
అబ్బాయి డబ్బున్నవాడా కాదా అని కాదు.
అవసరాలకు అనుగుణంగా సంపాదిస్తున్నాడా లేదా అని చూడాలి.
అబ్బాయి లక్షలు సంపాదిస్తున్నాడా లేదా అనేది కాదు.
జీవింతాంతం భార్యను ప్రేమగా చేసుకుంటాడా లేదా చూడాలి.
ఫారెన్ లో ఉన్నాడా లేదా అనేది కాదు..
సోషల్ స్టేటస్ కాదు నీతి గా నిజాయితీగా ఉంటాడా లేదా అని చూడాలి.
పెళ్లి ఎంత ఘనంగా చేసాం అన్నది కాదు,వివాహ బంధానికి ఎంత విలువ ఇస్తున్నాడు అనేది ముఖ్యం.

ఈ మధ్య అమ్మాయిలు,అమ్మాయి తల్లిదండ్రులు కూడా అలానే తయారయ్యారు.
వారి తల్లిదండ్రుల మనసత్వం మారాలి..
Please parents try to understand

0 0 0 0 0 0 0
Like Like Like Like Like Like Like